News July 16, 2024
కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు: రోహత్గీ

TG: విద్యుత్ కమిషన్ను <<13630574>>రద్దు<<>> చేయాలంటూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం KCR దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు వ్యవహారమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ అన్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ మాజీ CMలపై కేసులు పెడుతున్నారన్నారు. విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


