News July 16, 2024

కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు: రోహత్గీ

image

TG: విద్యుత్ కమిషన్‌ను <<13630574>>రద్దు<<>> చేయాలంటూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం KCR దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు వ్యవహారమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ అన్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ మాజీ CMలపై కేసులు పెడుతున్నారన్నారు. విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉందని, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్

image

AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 11, 2024

నితీశ్‌కుమార్ రెడ్డికి గంభీర్ గోల్డెన్ అడ్వైస్

image

కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.

News October 11, 2024

తల్లి లేదు.. రాదు.. పాపం ఆ పిల్లలకు అది తెలియదు!

image

ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.