News November 12, 2024
Political Power List: చంద్రబాబు స్థానం ఇదే

2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ లెక్కలతో INDIA TODAY’s 2024 Political Power Listలో కొత్త వారికి చోటు దక్కింది. జాబితాలో టాప్-10 నేతలు;
1. PM మోదీ 2. RSS చీఫ్ మోహన్ భాగవత్ 3. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 4. రాహుల్ గాంధీ 5. AP CM చంద్రబాబు నాయుడు 6. బిహార్ CM నితీశ్ కుమార్ 7. UP CM యోగి ఆదిత్యనాథ్ 8. TN CM MK స్టాలిన్ 9. బెంగాల్ CM మమతా బెనర్జీ 10. SP చీఫ్ అఖిలేశ్ యాదవ్
Similar News
News July 8, 2025
‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ కల్చర్‌తో ఫ్యూచర్ ఢమాల్!

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి కాపాడుకోవడమే ప్రస్తుతం గగనమైపోయింది. ఇలాంటి సమయంలో కొందరు క్షణికావేశంలో యాజమాన్యాలకు చెప్పకుండానే ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లకపోవడం, మెయిల్స్‌కు స్పందించకుండా నెగ్లెక్ట్ చేయడాన్ని ‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉద్యోగి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ఇలా చేస్తే ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.
News July 8, 2025
ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

ఇంగ్లండ్ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
News July 8, 2025
ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.