News February 10, 2025

సినీ వేదికలపై పాలిటిక్స్ చేయకూడదు: బండ్ల

image

‘లైలా’ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన <<15417744>>కామెంట్లపై<<>> నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే వారు ఆయా వేదికలపై పాలిటిక్స్ చేయకూడదని ట్వీట్ చేశారు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలని సూచించారు. నటించినవారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమన్నారు. ‘గెలిచిన వానికి ఓటమి తప్పదు. ఓడిన వానికి గెలుపు తప్పదు. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’ అని రాసుకొచ్చారు.

Similar News

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.

News March 6, 2026

T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

image

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.