News May 14, 2024

పోలింగ్: కరుణించిన వాతావరణం

image

AP: పోలింగ్ రోజున ఎండ ఇలాగే ఉంటే ఓటేసేదెలా అంటూ కొన్ని వారాల క్రితం ఆందోళన. గత కొన్ని రోజులుగా వర్షాలు మొదలవ్వడంతో వాన పడితే ఎలా అని మరో బెంగ. కానీ అటు భానుడు, ఇటు వరుణుడు కూడా పోలింగ్ రోజున కరుణించారు. పెద్దగా ఎండ, పెద్దగా వాన కూడా లేకుండా ఉష్ణోగ్రతలు సౌకర్యంగా ఉండటంతో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఓపిగ్గా లైన్లలో నిల్చుని ఓట్లు వేసి తమ బాధ్యతను నెరవేర్చారు.

Similar News

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’ వచ్చేది ఈ OTTలోనే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.450+ కోట్లతో రూపొందిన ఈ చిత్ర OTT హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపాయి. అయితే, దాదాపు 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అంచనా వేశాయి.

News January 10, 2025

జై షాకు బీసీసీఐ సన్మానం

image

ఐసీసీ నూతన ఛైర్మన్‌ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.

News January 10, 2025

క్షమాపణలు చెబితే సరిపోతుందా?: బొత్స

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘భక్తులు భారీగా వస్తారని ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? సామాన్యుల ప్రాణాలంటే సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యమా’ అని ఆయన ఫైర్ అయ్యారు.