News May 25, 2024

రైలు థీమ్‌తో పోలింగ్ కేంద్రాలు

image

దేశంలో ఆరో విడత పోలింగ్ నేపథ్యంలో బిహార్‌లో రైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకుంటున్నాయి. సివాన్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను రైలు భోగీల వలె అందంగా తీర్చిదిద్దడంతో ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు దేశంలో 49.2శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 70.19శాతం, అత్యల్పంగా యూపీలో 43.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Similar News

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

image

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.