News May 25, 2024
రైలు థీమ్‌తో పోలింగ్ కేంద్రాలు

దేశంలో ఆరో విడత పోలింగ్ నేపథ్యంలో బిహార్‌లో రైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకుంటున్నాయి. సివాన్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను రైలు భోగీల వలె అందంగా తీర్చిదిద్దడంతో ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు దేశంలో 49.2శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 70.19శాతం, అత్యల్పంగా యూపీలో 43.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Similar News
News April 13, 2026
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News April 13, 2026
రేపు CBSE టెన్త్ ఫలితాలు?

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రంలోపు బోర్డు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. https://www.cbse.gov.in/లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి.
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.


