News April 28, 2024

మే 10లోపు పాలిసెట్ ఫలితాలు

image

AP: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,59,989 మంది దరఖాస్తు చేసుకోగా 1,41,978 మంది పరీక్ష రాశారు. సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30న విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. మే 10లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

Similar News

News November 12, 2024

శత్రుదాడి జరిగితే పరస్పర రక్షణకు రష్యా, నార్త్ కొరియా డీల్

image

శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్‌కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.

News November 12, 2024

ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా మనిషి ట్రాకింగ్!

image

మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్‌ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్‌ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.

News November 12, 2024

BJPని కుక్కలా మార్చే టైమొచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే సరికొత్త వివాదానికి తెరలేపారు. OBC కమ్యూనిటీతో BJP తీరును విమర్శిస్తూ ఆ పార్టీ నేతలను కుక్కలుగా మార్చాలన్నారు. ‘అకోలా జిల్లా ఓబీసీలను నేనొకటే అడుగుతున్నా. మిమ్మల్ని కుక్కలని పిలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా? ఇప్పుడు బీజేపీని కుక్కలా మార్చే టైమొచ్చింది. వాళ్లకు అహంకారం తలకెక్కింది’ అని అకోలా సభలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అధికార మహాయుతి కూటమి భగ్గుమంది.