News September 12, 2024
‘కాంచన 4’లో పూజా హెగ్డే?
హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 10, 2024
గాజాలో పరిస్థితుల్ని చక్కదిద్దండి: ఇజ్రాయెల్‌కు అమెరికా సూచన
గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయంటూ అమెరికా తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసరంగా ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలని సూచించింది. ‘మానవతా సాయాన్ని అడ్డుకోవడాన్ని ఇజ్రాయెల్ మానుకోవాలి. గాజా ప్రజల వేదనను తగ్గించేందుకు సహకరించాలి. యుద్ధకాలం దాటిపోయింది. ఇది హమాస్‌తో ఒప్పందానికి వచ్చి ఇజ్రాయెల్ పౌరుల్ని ఇంటికి తెచ్చుకునే సమయం’ అని UNలో అమెరికా స్పష్టం చేసింది.
News October 10, 2024
తిరుమలలో రీల్స్.. దివ్వెల మాధురిపై కేసు
AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. ఇటీవల ఆమె కొండపై ఆలయం వద్ద రీల్స్ చేయడంతో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం ముందు వ్యక్తిగత విషయాలు మాట్లాడి మాధురి నిబంధనలు అతిక్రమించారని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
News October 10, 2024
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రేపు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. APలోని మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.