News August 28, 2024

అల్లు అర్జున్‌కు పూనమ్ కౌర్ మద్దతు?

image

మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య <<13912279>>వివాదం<<>> నెలకొన్న వేళ సినీనటి పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. గతంలో తాను బన్నీ, ఆయన సతీమణి స్నేహతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఆమె Xలో పోస్ట్ చేశారు. ‘ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం’ అని ట్వీట్ పెట్టారు. ‘లవ్ ఈజ్ ది ఆన్సర్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. దీంతో మెగా-అల్లు వివాదంలో ఆమె అల్లు అర్జున్‌కు మద్దతునిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News December 12, 2024

బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్

image

తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.

News December 12, 2024

పోలీసు కస్టడీకి వర్రా రవీందర్

image

AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ అరెస్టయ్యారు.

News December 12, 2024

నేను ప్రెగ్నెంట్ కాదు: సోనాక్షి సిన్హా

image

తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను ఇంకా గర్భం దాల్చలేదని తెలిపారు. బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె మండిపడ్డారు. తమకు పెళ్లై నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. కాగా గత జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.