News October 22, 2024

సిరాజ్ పేలవ ప్రదర్శన.. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్!

image

ఈ ఏడాది టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని పేసర్ సిరాజ్‌ను టీమ్ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన సిరాజ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇటీవల NZతో తొలి టెస్టులో 2 వికెట్లు తీశారు. దీంతో అతడిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి, నెక్స్ట్ మ్యాచులో ఆకాశ్ దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Similar News

News November 12, 2025

ఈ నెల 16న సింగరేణి ఆసుపత్రిలో మెడికల్‌ క్యాంప్‌

image

ఈ నెల 16న గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు సింగరేణి ఆర్జీ 1 జీఎం డీ.లలిత్‌ కుమార్‌ తెలిపారు. ఆర్జీ 1, 2, 3, ఏఏల్‌పీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, CPRMSE & CPRMSNE కార్డు కలిగిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 12 నుంచి సింగరేణి ఆసుపత్రిలో నమోదు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

News November 12, 2025

BRIC-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

<>BRIC<<>>-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌ 5 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఎస్సీ, MVSC, డిప్లొమా ఉత్తీర్ణత, NET/GATE/GPAT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. 40-50ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ils.res.in

News November 12, 2025

కొబ్బరి చెట్టుకు ఎరువులను ఎలా వేస్తే మంచిది?

image

కొబ్బరి చెట్టుకు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ తవ్విన పళ్లెములో వేసినప్పుడే, అవి నేలలో ఇంకి, వేర్లు, గ్రహించడానికి వీలు పడుతుంది. చెట్టు కాండమునకు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో 15 సెంటీమీటర్ల లోతున చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. చెట్లకు ఉప్పువేయటం, వేర్లను నరికివేయడం వంటి అశాస్త్రీయమైన పద్ధతులను పాటించవద్దు. దీని వల్ల చెట్లకు హాని కలుగుతుంది.