News October 22, 2024
సిరాజ్ పేలవ ప్రదర్శన.. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్!
ఈ ఏడాది టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని పేసర్ సిరాజ్‌ను టీమ్ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన సిరాజ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇటీవల NZతో తొలి టెస్టులో 2 వికెట్లు తీశారు. దీంతో అతడిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి, నెక్స్ట్ మ్యాచులో ఆకాశ్ దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News November 5, 2024
ఈ రెండు జెండాల్లో మాత్రమే ‘పర్పుల్’.. ఎందుకంటే?
దేశాల చరిత్ర, ఐడియాలజీని జాతీయ జెండాలు ప్రతిబింబిస్తాయి. రెడ్, బ్లూ, వైట్, గ్రీన్, ఎల్లో తదితర రంగులు జెండాల్లో కామన్‌గా ఉంటాయి. పర్పుల్ కలర్ మాత్రం 2 దేశాల(డొమెనికా, నికరాగ్వా) జెండాల్లోనే ఉంటుంది. పూర్వం ఇది అత్యంత ఖరీదైన రంగు. 1 గ్రాము ఊదా చేయడానికి 10K నత్తలను చంపాల్సి వచ్చేది. అందుకే ఈ రంగును ఎంచుకునేవారు కాదు. 1856లో విలియమ్(UK) ఈ రంగు ఫార్ములా కనిపెట్టడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది.
News November 5, 2024
ఈ రికార్డు కోహ్లీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు
ప్రపంచ క్రికెట్లో మరెవ్వరికీ లేని అరుదైన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే సొంతం. కెరీర్లో 168 సిరీసుల్లో 538 మ్యాచులు ఆడిన అతడు 21సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (POTS)గా ఎంపికయ్యారు. టెస్టుల్లో 3, వన్డేల్లో 11, టీ20ల్లో 7 సార్లు ఈ అవార్డు గెలుచుకున్నారు. సచిన్ 183 సిరీసుల్లో 20 POTSతో రెండో ప్లేస్‌లో ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో మారిన డైనమిక్స్‌తో ఈ కోహ్లీ రికార్డును ఇంకెవరైనా బద్దలు కొట్టగలరా?
News November 5, 2024
కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
TG: ‘ఫార్ములా ఈ కార్’ రేసింగ్ అంశం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను KTR ఓ విదేశీ సంస్థకు బదిలీ చేయించారని ED అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా ఈడీతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే మంత్రి పొంగులేటి దీపావళి బాంబ్ అని టాక్.