News January 16, 2025
జారిపడ్డ పోప్.. చేతికి గాయం

పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.
Similar News
News February 15, 2025
5 ఖండాలను లింక్ చేస్తూ మెటా కేబుల్.. భారత్ కీ రోల్!

భారత్ సాయంతో ప్రపంచంలో అతి పొడవైన సముద్ర కేబుల్ వేసేందుకు మెటా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 5 ఖండాలను లింక్ చేస్తూ 50వేల కి.మీ మేర సముద్రం లోపల కేబుల్ వేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని, ఏఐ సర్వీసులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మెయింటనెన్స్, ఫైనాన్సింగ్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది.
News February 15, 2025
రూ.100 కోట్లకు చేరువలో ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
News February 15, 2025
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి: రకుల్

కంఫర్ట్ జోన్ ప్రజలను ఎదగనీయదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు అలవాటైన ప్రదేశం నుంచి బయటకు రండి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు. మీరు ఎదగాలంటే అక్కడి నుంచి బయటపడాలి. కఠినమైన విషయాలు నేర్చుకోవాలి. కొత్తదనాన్ని కోరుకోవాలి. సుఖవంతమైన జీవితం అందరినీ బద్ధకస్థులుగా మారుస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు.