News February 22, 2025

ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం

image

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఆయనకు చికిత్స అందిస్తున్న జెమెల్లీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘పోప్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. బ్రాంకైటిస్‌గా మొదలైన సమస్య డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయనకు విశ్రాంతి అవసరం. కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

Similar News

News March 27, 2025

బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టిన దుబాయ్ ప్రిన్స్

image

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్, షేఖా షేఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మఖ్తూమ్ దంపతులు తమ నాలుగో బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టడం చర్చకు దారితీసింది. ఆ పదానికి అర్థం ‘సమృద్ధి’ అని తెలిసింది. శిశువుకు అమ్మమ్మ ‘షేఖా హింద్ బింట్ మఖ్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్’ పేరునే పెట్టడం విశేషం. ‘దేవుడి ఆశీర్వాదంతో మాకు పుట్టిన నాలుగో బిడ్డకు హింద్‌గా నామకరణం చేశాం’ అని ప్రిన్స్ తెలిపారు.

News March 27, 2025

నటి రన్యా రావుకు షాక్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

News March 27, 2025

రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

error: Content is protected !!