News February 5, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి పుష్పలత(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు. తెలుగులో చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈమె కూతురు మహాలక్ష్మి హీరోయిన్గా రెండు జెళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో నటించారు.
Similar News
News December 9, 2025
KNR: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. మెదడి విడతలో 5 మండలాలు గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. మొత్తం 92 పంచాయతీలకు గాను మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.
News December 9, 2025
పీకల్లోతు కష్టాల్లో భారత్

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.


