News February 5, 2025

ప్రముఖ నటి కన్నుమూత

image

ప్రముఖ సీనియర్ నటి పుష్పలత(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు. తెలుగులో చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈమె కూతురు మహాలక్ష్మి హీరోయిన్‌గా రెండు జెళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో నటించారు.

Similar News

News February 13, 2026

శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు

image

శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 గంటలు రాకపోకలకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 3వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

News February 13, 2026

ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

image

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాకుంటే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘విశ్వేశ్వర’’

image

విశ్వం అంటే అనంతమైన బ్రహ్మాండం. ఈశ్వర అంటే పాలకుడు. ఈ సృష్టిలోని ప్రతి అణువుకూ, ప్రతి జీవికీ శివుడే ఆధారం. కాలాతీతుడైన ఆయన సమస్త లోకాలను శాసిస్తాడు. కాశీలో ఆయన ‘విశ్వేశ్వరుడు’గా కొలువై భక్తులకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో ఆయన తారక మంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ కాబట్టి ఆయన ‘విశ్వేశ్వరుడు’.