News February 16, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్‌లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.
Similar News
News March 23, 2025
యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీ

జస్టిస్ <<15855484>>యశ్వంత్ వర్మ<<>> నివాసంలో భారీగా నగదు దొరకడంపై CJI అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్&హర్యానా HC CJ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ HC CJ సంధవాలియా, కర్ణాటక HC CJ అను శివరామన్ ఉన్నారు. ఈ విచారణ సమయంలో వర్మకు ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని సీజేఐ ఆదేశించారు. పారదర్శకత కోసం ఢిల్లీ HC CJ రిపోర్ట్‌తో పాటు వర్మ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
News March 23, 2025
కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
News March 23, 2025
SLBC సహాయక చర్యలపై వివరాలు బయటపెట్టాలి: హరీశ్ రావు

TG: SLBC సొరంగం వద్ద ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘ఘటన జరిగి నెల రోజులైనా సొరంగంలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం. భూ భౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాజకీయ ప్రయోజనాల కోసం టన్నెల్ పనులు ప్రారంభించారు’ అని ట్వీట్ చేశారు.