News September 13, 2024
పోర్ట్‌బ్లెయిర్ ఇకపై ‘శ్రీ విజయపురం’: అమిత్ షా
పోర్ట్‌బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయ పురం’గా మారుస్తున్నామని HM అమిత్‌షా అన్నారు. వలస వారసత్వం నుంచి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోదీ ఆశయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. ‘భారత స్వాతంత్ర్య చరిత్రలో A&N దీవులది ప్రత్యేక పాత్ర. ఒకప్పటి చోళుల నేవీ స్థావరం ఇప్పుడు భారత సైన్యానికి వ్యూహాత్మకం. నేతాజీ మొదట తిరంగా జెండాను ఎగరేసింది, వీర సావర్కర్ జైలుశిక్ష అనుభవించింది ఇక్కడే’ అని అన్నారు.
Similar News
News October 5, 2024
MGR వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్‌కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్‌ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
News October 5, 2024
ఇలా చేస్తే వాహనదారులకు రాయితీ!
TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్‌కు లైఫ్ ట్యాక్స్‌లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్‌కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.
News October 5, 2024
సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్ లాహోటిలకు సమన్లు
సెబీ, ట్రాయ్‌ల పనితీరుపై పార్లమెంటు PAC ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ మేరకు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమీక్షకు రెండు సంస్థల నుంచి మాదబీ, లాహోటిల తరఫున సీనియర్ అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కమిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఈ సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది.