News February 26, 2025
రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
ఓల్డ్ బ్యాంకు అకౌంట్లో డబ్బు ఫ్రీజ్ అయిందా?

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT
News November 4, 2025
BELలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.


