News February 26, 2025

రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

IPL: నేడు రాయల్స్‌తో రైడర్స్ ఢీ

image

ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గువహటిలో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా, చెరో 14 విజయాలు సాధించాయి. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఈ రెండు జట్లు ఇవాళ గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచులోనూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఛాన్సుంది. ఇవాళ గెలిచేదెవరో కామెంట్ చేయండి.

News March 26, 2025

ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.

News March 26, 2025

అర్జున్ టెండూల్కర్‌ను బెస్ట్ బ్యాటర్‌గా మారుస్తా: యువరాజ్ తండ్రి

image

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ‘అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతా. నా దగ్గర 12days శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా?’ అని గుర్తుచేశారు.

error: Content is protected !!