News March 5, 2025

కర్నూలు జైలుకు పోసాని తరలింపు

image

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు. కాగా ఆదోని పీఎస్‌లో నమోదైన కేసుపై కర్నూలు కోర్టులో వాదనలు జరిగాయి. ఆ సమయంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆదోని జైలు వద్దని, కర్నూలు జైలుకు తరలించాలని జడ్జికి విన్నవించారు. దీంతో ఆయనను కర్నూలు కారాగారానికి తీసుకెళ్లారు.

Similar News

News March 5, 2025

400 ఎకరాలు.. రూ.30వేల కోట్లు

image

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.

News March 5, 2025

IPL-2025లో కొత్త రూల్స్

image

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్‌లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

News March 5, 2025

డ్వాక్రా మహిళలకు సర్కార్ తీపికబురు!

image

AP: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

error: Content is protected !!