News March 5, 2025

కర్నూలు జైలుకు పోసాని తరలింపు

image

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు. కాగా ఆదోని పీఎస్‌లో నమోదైన కేసుపై కర్నూలు కోర్టులో వాదనలు జరిగాయి. ఆ సమయంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆదోని జైలు వద్దని, కర్నూలు జైలుకు తరలించాలని జడ్జికి విన్నవించారు. దీంతో ఆయనను కర్నూలు కారాగారానికి తీసుకెళ్లారు.

Similar News

News March 25, 2025

బ్యూటిఫుల్ కపుల్.. 64 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!

image

హర్ష్, మృణు అనే జంట 1960లో పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి మతాలు వేరవడంతో అప్పట్లో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే అప్పుడు అనాథలుగా పెళ్లి చేసుకున్న వీరికి ఇప్పుడు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించాలని పిల్లలు, మనవళ్లు నిర్ణయించారు. 64 ఏళ్ల తర్వాత వీరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి ఫొటోలు వైరలవుతున్నాయి. చూడ ముచ్చటైన జంట అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News March 25, 2025

పవన్ కళ్యాణ్‌కు ఆ పేరు పెట్టింది నేనే: హుస్సేని

image

లుకేమియా కారణంగా <<15878066>>చనిపోయిన<<>> కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు.

News March 25, 2025

న్యూజిలాండ్‌లో భూకంపం

image

న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 7.13 గంటలకు పశ్చిమ తీరంలోని సౌత్ ఐలాండ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.

error: Content is protected !!