News March 12, 2025
హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉండగా గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ కొట్టేయడంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.
News March 12, 2025
రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.