News June 28, 2024
ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్
AP: సీనియర్ ఐఏఎస్‌లు పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి, పీయూష్ కుమార్‌కు ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను నియమించింది. కాగా వీరిద్దరూ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News October 12, 2024
జమ్మి ఆకులే ‘బంగారం’!
తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
News October 12, 2024
‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?
నవానగర్ (ప్రస్తుత జామ్‌నగర్) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గతంలో దీన్ని జడేజా రాజ్‌పుత్ రాజవంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. నవానగర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయన పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.
News October 12, 2024
DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్‌కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.