News June 4, 2024
సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతున్నారా? జాగ్రత్త!
AP: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రత్యర్థులను బెదిరిస్తూ ఫొటోలు, వీడియోలతో పోస్టులు పెట్టినా, షేర్లు చేసినా <<13368661>>కఠిన చర్యలు<<>> తప్పవని DGP ఇప్పటికే హెచ్చరించారు. కాబట్టి ఏ పార్టీ మద్దతుదారులైనా సంయమనం పాటించండి. పంతాలు, ఇగోలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు.#BE CAREFUL
Similar News
News September 13, 2024
విరాట్ వచ్చేశాడు.. ప్రాక్టీస్ మొదలు
ఈమధ్య కాలంలో లండన్‌లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల కోసం చెన్నైలో నెట్స్‌లో 45 నిమిషాల పాటు చెమటోడ్చారు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లందరూ సాధన చేశారు. ఈ నెల 19న చెన్నైలో బంగ్లాతో తొలి టెస్టు మొదలుకానుంది. నగరంలో విరాట్ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు ఆడనున్నారు. అక్కడ 4 టెస్టుల్లో ఒక సెంచరీతో 267 పరుగులు చేశారు.
News September 13, 2024
మాపై ఆరోపణలు పచ్చి అబద్ధం: సెబీ చీఫ్
తమపై వచ్చిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని సెబీ చీఫ్ మాధబీ బుచ్ అన్నారు. సంస్థ రూల్స్, గైడ్‌లైన్స్ అన్నీ పాటించానని చెప్పారు. ‘మా IT రిటర్నులను మోసపూరితంగా పొందడం అక్రమం. ఇది ప్రాథమిక హక్కైన మా గోప్యత, IT చట్టాన్ని ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేశారు. సెబీలో పనిచేస్తూనే మాధబి తన అగోరా అడ్వైజరీ ద్వారా ICICI, M&M, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల నుంచి ఆదాయం పొందారని కాంగ్రెస్, హిండెన్‌బర్గ్ ఆరోపించడం తెలిసిందే.
News September 13, 2024
యూపీలో మరో మహిళపై తోడేలు దాడి
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో మరోసారి ఓ మహిళ(28)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాధితురాలి మెడ, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆరు తోడేళ్లలో అధికారులు ఐదింటిని పట్టుకోగా, మరొకటి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. అది గత 4 రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆరో తోడేలును పట్టుకోవడం కష్టమవుతోందని అధికారులు వివరిస్తున్నారు.