News October 15, 2024

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

image

TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.

Similar News

News November 12, 2024

30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ.. తాజాగా అరెస్టు

image

త‌మిళ‌నాడులోని తెప్ప‌కులం PS ప‌రిధిలో 30 ఏళ్ల క్రితం ₹60 చోరీ చేసిన నిందితుడిని మ‌ధురై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పెండింగ్ కేసులు విచారిస్తుండగా ఈ కేసు వెలుగుచూసింది. పోలీసులు జ‌క్క‌తోప్పు ప్రాంతానికి వెళ్లి నిందితుడు పన్నీర్ సెల్వం కోసం విచారించారు. అతను శివ‌కాశిలో ఉంటున్నాడని తెలిసి అక్క‌డికి వెళ్లి అరెస్టు చేశారు. సగటు ద్రవ్యోల్బణం 6.5% వేసుకున్నా అప్పటి ₹60 విలువ 2024లో ₹396.86 అవుతుంది.

News November 12, 2024

కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా

image

విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.

News November 12, 2024

6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

image

AP: కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.