News March 30, 2024
డీఎస్సీ వాయిదా

AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో DSC నిలిచిపోయింది.
Similar News
News April 17, 2026
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం: CM రేవంత్

TG: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత చరిత్రలో గుర్తుండిపోయే క్షణమని పేర్కొన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని తెలిపారు. ‘స్టాలిన్, మమత, అఖిలేశ్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలూ, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు. జైహింద్’ అని ట్వీట్ చేశారు.
News April 17, 2026
డీలిమిటేషన్ బిల్లు వెనక్కి.. కేంద్రానికి బిగ్ షాక్!

మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు <<19674859>>వీగిపోయింది.<<>> దీంతో డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందంటున్నారు. మీరేమంటారు?
News April 17, 2026
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..


