News June 25, 2024
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా

TG: రాష్ట్రంలో జరగాల్సిన ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. మొత్తం 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జులై 4న తొలి విడత, జులై 26న రెండో విడత, ఆగస్టు 8న మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు.
Similar News
News January 18, 2026
T20 WC టీమ్‌లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్‌లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్‌కు ప్రపంచకప్‌లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్‌లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ లేకపోవడంపై వర్క్‌లోడ్ మ్యానేజ్మెంటే కారణమని వివరించారు.
News January 18, 2026
నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పిస్తాం: CM

TG: నర్సింగ్ కోర్సు చేసిన వారికి జపాన్, జర్మనీలో మంచి డిమాండ్ ఉందని CM రేవంత్ అన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్సుతో పాటు జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్‌కి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. JNTU కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.
News January 18, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in


