News June 25, 2024
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా

TG: రాష్ట్రంలో జరగాల్సిన ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. మొత్తం 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జులై 4న తొలి విడత, జులై 26న రెండో విడత, ఆగస్టు 8న మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు.
Similar News
News January 14, 2026
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

AP: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.
News January 14, 2026
సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.


