News June 3, 2024

బడిబాట వాయిదా

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పట్నుంచి తిరిగి ప్రారంభిస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. బడి మానేసిన, బడిలో చేరని పిల్లను గుర్తించి వారిని స్కూళ్లలో చేర్చేందుకు ఈ నెల 19 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Similar News

News September 8, 2024

రేపు 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల

image

AP: వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹లక్ష చొప్పున రేపు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు dy.cm పవన్ సొంత నిధుల నుంచి ₹4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు.

News September 8, 2024

వినాయక చవితి వేడుకల్లో బంగ్లాదేశ్ క్రికెటర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో తన నివాసంలో గణేషుడి ప్రతిమకు పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దాస్ సెంచరీతో ఆకట్టుకున్నారు.

News September 8, 2024

రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..

image

AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.