News April 10, 2024
కాసేపట్లో వైసీపీలో చేరనున్న పోతిన మహేశ్

AP: రెండురోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా మహేశ్ విజయవాడ వెస్ట్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో జనసేనకు రాజీనామా చేశారు.
Similar News
News November 27, 2025
పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఇటు ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ స్థాయికి ఎదిగారు.
News November 27, 2025
ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్‌రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.
News November 27, 2025
సొరకాయల కోత ఎప్పుడు చేపడితే మంచిది?

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.


