News April 10, 2024
కాసేపట్లో వైసీపీలో చేరనున్న పోతిన మహేశ్

AP: రెండురోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా మహేశ్ విజయవాడ వెస్ట్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో జనసేనకు రాజీనామా చేశారు.
Similar News
News February 18, 2026
అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.
News February 18, 2026
మార్కుల్లో తేడా వస్తే టీచర్‌కు ఫైన్!

AP: పదో తరగతి మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్‌లో 5 కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్‌కు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఫైన్ విధించనుంది. ఒక పేపర్‌ను తప్పకుండా 12 నిమిషాలు దిద్దాలనే నిబంధన పకడ్బందీగా అమలు చేయనుంది. గతేడాది వ్యాల్యూయేషన్‌లో భారీగా తప్పులు దొర్లడం, ఓ స్టూడెంట్‌కు ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం పెద్ద వివాదమైంది.
News February 18, 2026
ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా?

చర్మ ఆరోగ్యం కోసం ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిదే కానీ వాటిని తరచూ వాడితే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్తరకం ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ముఖం శుభ్రం చేసుకోకుండా ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.


