News March 22, 2024

పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

image

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.

Similar News

News October 20, 2025

రోహిత్, విరాట్ ఫామ్‌పై స్పందించిన గవాస్కర్

image

ఆస్ట్రేలియాతో రెండో ODIలో రోహిత్, విరాట్ తిరిగి పుంజుకుంటారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వారిద్దరూ భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ 2 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడట్లేదు. AUSలో బౌన్సీ పిచ్‌పై అంత ఈజీ కాదు. వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా లయను అందుకుంటారు. టీమ్ ఇండియా 300+ రన్స్ చేస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

News October 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

image

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 20, 2025

జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

image

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>