News April 4, 2024
ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్

TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేశారు. చాలా రోజులుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్స్ కట్టకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వినియోగించారని అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు పంపామని చెప్పారు. కాగా రేపు ఇదే స్టేడియంలో SRH-CSK మ్యాచ్ నేపథ్యంలో పవర్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 23, 2025
సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్‌ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్‌కిల్లర్‌లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
News November 23, 2025
గనుల సీనరేజీ పాలసీని సరళీకృతం చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP: వైసీపీ హయాంలో మైనింగ్‌పై ఆధారపడిన వారికి దినదినగండంగా గడిచిందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో పారదర్శకంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గనుల సీనరేజీ పాలసీని త్వరలోనే సరళీకృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఇక నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ కొనసాగుతోందని, ఎంతటివారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు.


