News April 4, 2024

ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్

image

TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేశారు. చాలా రోజులుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్స్ కట్టకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వినియోగించారని అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు పంపామని చెప్పారు. కాగా రేపు ఇదే స్టేడియంలో SRH-CSK మ్యాచ్ నేపథ్యంలో పవర్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 17, 2026

జగ్గారెడ్డి PCC చీఫ్ అయితే 100 సీట్లు గ్యారంటీ: కోమటిరెడ్డి

image

TG: PCC చీఫ్‌గా జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జగ్గారెడ్డి మరొక PJR. ఆయన లాగే ప్రజా నాయకుడు. జగ్గారెడ్డి PCC చీఫ్‌గా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుస్తుంది. మహేశ్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని PCC చీఫ్‌గా చేయాలి’ అని సూచించారు.

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

News March 17, 2026

TGRJC-CET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలో 35 గురుకుల జూ.కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశానికి ‘TGRJC-CET-2026’ నోటిఫికేషన్ విడుదలయింది. MPC, BPC, MEC, CEC గ్రూప్స్‌లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టు మే3న నిర్వహిస్తారు. APR15 వరకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/