News May 11, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ కోతలు: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం కనిపించలేదు. శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేసింది. ఆ పార్టీ చేసిన తప్పులే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాటేస్తాయి’ అని విమర్శించారు.
Similar News
News February 16, 2026
మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
News February 16, 2026
2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News February 16, 2026
జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.


