News September 16, 2024
డిస్కౌంట్లతో పండగ సేల్స్‌లో ‘పవర్ ప్లే’
భారీ డిస్కౌంట్లతో ఓనమ్, వినాయక చవితికి కార్లు, బైకులు, ఫ్రిజ్‌లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సేల్స్ బాగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ ఇలాగే ఉంటే దీపావళి నాటికి సేల్స్ మరింత పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో మారుతీ బుకింగ్స్ 10% పెరిగాయి. కేరళలో టూవీలర్ సేల్స్ నిరుటితో పోలిస్తే 8% పెరిగాయి. ఫ్రిజులు 15%, వాషింగ్ మెషీన్లు 13% ఎక్కువ సేల్ అయ్యాయి.
Similar News
News October 5, 2024
హర్షసాయిపై లుక్‌అవుట్ నోటీసులు
TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.
News October 5, 2024
TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు
AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.