News January 9, 2025

పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్: ఇండియా ర్యాంక్ ఇదే!

image

ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ 5 స్థానాలు దిగజారింది. 80 నుంచి 85వ స్థానానికి ప‌డిపోయింది. వీసా ర‌హితంగా ట్రావెల్ చేయ‌గ‌లిగిన గ‌మ్య‌స్థానాల సంఖ్య‌ ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగ‌పూర్ శ‌క్తిమంత‌మైన పాస్‌పోర్ట్‌ (195 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ)గా నిలిచింది.

Similar News

News January 19, 2025

కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

News January 19, 2025

ఈ ఏడాది అతిపెద్ద ముప్పు ఇదే..

image

2024లో ఎన్నో యుద్ధాలను చూసిన ప్రపంచానికి ఈ ఏడాది కూడా ఆ ముప్పు తప్పదని ఓ రిపోర్టు వెల్లడించింది. 2025లో దేశాల వార్ కారణంగానే 23% ప్రమాదం ఉంటుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్-వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. ఆ తర్వాత వాతావరణ మార్పులు(14%), భౌగోళిక ఆర్థిక సమస్యల(8%) వల్ల ముప్పు ఉందంది. వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచార వ్యాప్తి, పదేళ్లలో తీవ్ర వాతావరణ మార్పులు ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొంది.

News January 19, 2025

ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన

image

TG: CM రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర బృందం బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో రూ.3500Crతో ఆర్ట్ డేటా సెంటర్ పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్, రూ.450Crతో IT పార్క్ నిర్మించేందుకు క్యాపిటల్ ల్యాండ్ అంగీకరించాయి. ఇండియన్ ఓషియన్ గ్రూప్, DBS, బ్లాక్‌స్టోన్, మైన్ హార్డ్ తదితర కంపెనీలతో CM చర్చించారు. రేపటి నుంచి ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.