News November 4, 2024

మరో క్రేజీ ప్రాజెక్టుకు ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్?

image

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్-2 చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ జై హనుమాన్, మోక్షజ్ఞతో సినిమాలు చేయనున్నారు. వీటి తర్వాత క్రేజీ కాంబో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.

Similar News

News December 7, 2024

ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా: బాలకృష్ణ

image

అన్‌స్టాపబుల్ షోలో హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్‌గా చేస్తానని చెప్పారు. ఈ షోకు నవీన్ పొలిశెట్టి, శ్రీలీల అతిథులుగా రాగా వారితో సరదాగా సంభాషించారు. మరోవైపు తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్ చెప్పారు. తన ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే అని, తాను మాత్రం నటనను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.

News December 7, 2024

BGTలో షమీ ఆడటం కష్టమే!

image

BGTలో భారత పేసర్ షమీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతనికి NCA నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణం. అతను టెస్టుల్లో బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నారా లేదా అనే దానిపై NCA టీమ్ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. అతడిని AUSకు పంపకపోవచ్చని, పంపినా చివరి టెస్టులో మాత్రమే ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం SMAT T20లో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. ఎల్లుండి చండీగఢ్‌తో బెంగాల్ ప్రీ QF ఆడనుంది.

News December 7, 2024

పుష్ప-2: రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు

image

‘పుష్ప-2’ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మైల్‌స్టోన్‌ను అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించిందని తెలిపింది. తొలి రోజు రూ.294కోట్ల కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు గంటకు లక్షకుపైగా అమ్ముడవడం గమనార్హం. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.