News July 25, 2024
వచ్చే నెలలో ప్రభాస్-హను సినిమా షూటింగ్?
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాపై ఆగస్టు 22న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి షూటింగ్‌ను ప్రారంభిస్తారని సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఒక ప్రత్యేక సెట్ వేశారని పేర్కొన్నాయి. ‘స్పిరిట్’ మూవీ ఆలస్యం కానున్న నేపథ్యంలో దానికంటే ముందే రాజాసాబ్, హనుతో చేసే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని రెబల్ స్టార్ భావిస్తున్నారట.
Similar News
News January 28, 2025
టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.
News January 28, 2025
BJPలోకి అంబటి రాయుడు?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.
News January 28, 2025
IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.