News August 19, 2024

ప్రభాస్‌ అంటే అసూయేమో!: ఆది సాయికుమార్

image

‘కల్కి 2898ఏడీ’లో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటిపై నటుడు ఆది సాయికుమార్ స్పందించారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ట్వీట్ చేశారు. వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 15, 2024

ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

image

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇడ్లీ తినడం వల్ల చనిపోయారు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సురేశ్(49) అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినగా అవి గొంతులో ఇరుక్కున్నాయి. ఊపిరాడక కుప్పకూలిన అతన్ని నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.

News September 15, 2024

వారికి కోరుకున్న చోట స్థలాలిస్తాం: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములిచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు.

News September 15, 2024

రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: హరీశ్

image

TG: అరెకపూడి గాంధీ కాంగ్రెస్ MLA అని CM రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘మనోళ్లే వాళ్లింటికి వెళ్లి తన్నారని రేవంత్ అన్నారు. అంటే గాంధీ వాళ్లోడే అన్నట్టుగా. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించానని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. మళ్లీ పైనుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.