News December 13, 2024
ప్రభాస్ ‘కల్కి’ మరో ఘనత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా మరో ఘనత సాధించింది. ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో ఎక్కువగా వెతికిన మూవీగా నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ ఇండియా పేర్కొంది. ‘ఆలస్యం అయ్యిందా? కల్కి ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోవడంతో ఈలలు వేయడాన్ని ఆపలేకపోయారు. కల్కి 2024లో అత్యధిక ట్రెండింగ్ అయిన చలన చిత్ర శోధనలో ఒకటిగా నిలిచింది’ అని తెలిపింది.
Similar News
News January 27, 2026
మంచుదుప్పటి నడుమ గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉందో!

అమెరికాలో భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డల్లాస్లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మెరిసిపోతోంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ మంచుతో ఉన్న ఆలయం ఫొటోలు ప్రస్తుతం SMలో వైరలవుతున్నాయి.
News January 27, 2026
ఈ లక్షణాలుంటే C విటమిన్ లోపించినట్లే..

C విటమిన్ మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించడం, జలుబు, దగ్గు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు, దంతాలు కదలడం, చర్మం పొడిగా మారడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం, కీళ్ల నొప్పులు, పొడి జుట్టు, చిట్లిన వెంట్రుకలు ఉంటే C విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించాలంటున్నారు.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ICMRలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<


