News December 13, 2024

ప్రభాస్ ‘కల్కి’ మరో ఘనత

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా మరో ఘనత సాధించింది. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వెతికిన మూవీగా నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ ఇండియా పేర్కొంది. ‘ఆలస్యం అయ్యిందా? కల్కి ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోవడంతో ఈలలు వేయడాన్ని ఆపలేకపోయారు. కల్కి 2024లో అత్యధిక ట్రెండింగ్ అయిన చలన చిత్ర శోధనలో ఒకటిగా నిలిచింది’ అని తెలిపింది.

Similar News

News January 17, 2025

SBI ఖాతాదారులకు ALERT

image

త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్స్‌లో YONO సేవల్ని నిలిపివేయనున్నట్లు SBI ప్రకటించింది. అలాంటి ఫోన్లు వాడుతున్న వారు ఫిబ్రవరి 28లోపు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని అలర్ట్ సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాత వెర్షన్ మొబైల్స్‌ యూజ్ చేస్తున్నవారికి సైబర్ నేరగాళ్ల ముప్పు ఉన్నట్లు సమాచారం.

News January 17, 2025

IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం

image

AP: సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు స్పెషల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై వీరు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు.

News January 17, 2025

భారీగా తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు

image

గత కొన్ని వారాలుగా భారత ఫారెక్స్ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. జనవరి 10తో ముగిసిన వారానికి ఇండియా నిల్వలు $8.714 బిలియన్లు తగ్గి $625.871 బిలియన్లకు చేరాయి. అంతకు ముందు వారంలో $5.693 బిలియన్లు తగ్గాయి. రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఇటీవల కాలంలో ఫారెక్స్‌లో జోక్యం చేసుకుంటోంది. కాగా చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో ఫారెక్స్ రిజర్వ్‌లు $704.885 జీవిత కాల గరిష్ఠానికి చేరాయి.