News August 12, 2024
డేంజర్లో ప్రభాస్ ‘కల్కి’ రికార్డ్?

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ‘కల్కి 2898ఏడీ’ హిందీలో తొలిరోజే రూ.23 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అయితే శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ 2’ హిందీ బెల్ట్లో ఆ కలెక్షన్లను బద్దలుగొట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెల 15న రిలీజ్ కానుండగా 14న రాత్రి నుంచే షోలు మొదలుకానున్నాయి. తొలి భాగం ‘స్త్రీ’ రూ.100 కోట్లు సాధించడంతో సెకండ్ పార్ట్కి తొలిరోజు రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Similar News
News November 26, 2025
నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

1921: వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది
1997: సినీ నటుడు మందాడి ప్రభాకర రెడ్డి మరణం
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబై ఉగ్ర దాడిలో 160 మందికిపైగా మృతి (ఫొటోలో)
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం
News November 26, 2025
అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.
News November 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


