News April 10, 2024

జూన్ 20న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 AD’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు మే 9వ తేదీన రిలీజ్ కావట్లేదని, జూన్ 20వ తేదీకి మారినట్లు సినీవర్గాలు తెలిపాయి. నిన్నటి వరకూ మే 30వ తేదీన ‘కల్కి’ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

Similar News

News March 27, 2026

దారుణం: బిడ్డ ఏడుస్తోందని..

image

AP: బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాలతో వారి ప్రాణాలు తీస్తున్నారు. తిరుపతి(D) నరసరాజు అగ్రహారంలో 5 నెలల కూతురు ఏడుస్తోందని తల్లి హేమావతి చంపేసింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి ‘నీకో బ్యాడ్ న్యూస్. నాకో గుడ్ న్యూస్. పాపను చంపేశా’ అని చెప్పినట్లు సమాచారం. మార్కాపురం(D) త్రిపురాంతకంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురు తులసి(9)ని తండ్రే హతమార్చాడు.

News March 27, 2026

‘శ్రీరామ’ అంటే అదే పుణ్య మంత్రం

image

శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయాలని చెబుతుంటారు. రామ నామమును తారకమంత్రమని కూడా అంటారు. తారకమంత్రమంటే దేన్నైనా తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి అలాంటి నియమాలేవీ లేవు. శ్రీరామ అంటే అదే పుణ్య మంత్రం. రామనామంతో ధ్యానం చేయడం వల్ల సకల పాపాలు తొలిగిపోతాయి.

News March 27, 2026

సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే

image

TG: ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచారం/పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30days గడువుంటుంది. 5ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.