News April 10, 2024
జూన్ 20న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు మే 9వ తేదీన రిలీజ్ కావట్లేదని, జూన్ 20వ తేదీకి మారినట్లు సినీవర్గాలు తెలిపాయి. నిన్నటి వరకూ మే 30వ తేదీన ‘కల్కి’ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
Similar News
News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
News March 27, 2025
జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.
News March 27, 2025
అందరం అవయవదానం చేద్దాం.. సభలో కేటీఆర్ ప్రతిపాదన

TG: ఆర్గాన్ డొనేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. సభ్యులంతా అవయవదానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సభ నుంచే ప్రజలకు మంచి సందేశం పంపాలని ఆయన అన్నారు.