News August 18, 2024

‘జోకర్’లా ప్రభాస్.. బాలీవుడ్ నటుడి హాట్ కామెంట్స్

image

హీరో ప్రభాస్‌నుద్దేశించి బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కల్కి 2898AD’ చిత్రంలో ఆయన గెటప్ ‘జోకర్’లాగా ఉందన్నారు. మరోవైపు అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మేకర్స్ ప్రభాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో తనకు అర్థం కావట్లేదన్నారు. కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Similar News

News September 17, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
* రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడ్రా.. రండి: CM రేవంత్ రెడ్డి
* తెలంగాణ తల్లిని అవమానిస్తారా?: KTR
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
* AP: ఐటీలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: CBN
* రాజధాని రైతుల ఖాతాల్లో కౌలు డబ్బులు జమ
* చంద్రబాబు పేదల వ్యతిరేకి: జగన్
* కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు

News September 17, 2024

ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్ కౌంటర్

image

భారత్, గాజా, మయన్మార్ వంటి దేశాల్లో ముస్లింల పరిస్థితిని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను స్వీకరించబోమని విదేశాంగ శాఖ Xలో ట్వీట్ చేసింది. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడే దేశాలు తమ దేశంలోని పరిస్థితులను ముందుగా పరిశీలించుకోవాలని చురకలు అంటించింది.

News September 17, 2024

ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం

image

ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.