News August 10, 2024
ప్రభాస్ ‘రాజా సాబ్’ చిన్న సినిమా కాదు: నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘రాజాసాబ్’ను మాత్రం వీలైనంత సింపుల్‌గా, తక్కువ బడ్జెట్‌లో చేస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిని సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. అందరూ అనుకుంటున్నదానికంటే ఇది చాలా పెద్ద సినిమా అని ఆయన పేర్కొన్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుందని, పలు అంశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలిపారు.
Similar News
News September 20, 2024
జీతాలు పెంపు.. ఆరోగ్య మిత్రల సమ్మె విరమణ
TG: కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్య మిత్రలు వెల్లడించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు ఫలించాయి. క్యాడర్ మార్పు, వేతనం రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తూ వారు లేఖ విడుదల చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవల విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. మంత్రి దామోదరకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
News September 20, 2024
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్
AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
News September 20, 2024
రోహిత్ వైఫల్యం.. ఇది నాలుగోసారి మాత్రమే!
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో మళ్లీ విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్లకే పేస్‌కు చిక్కారు. కానీ ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రోహిత్ రెండంకెల స్కోరు దాటకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతకు ముందు 2015లో శ్రీలంక, 2015, 2023లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో శర్మ సింగిల్ డిజిట్లకే పెవిలియన్ చేరారు. వచ్చే టెస్టులో అయినా ఆయన పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.