News March 30, 2024
డిసెంబర్‌లో ప్రభాస్-సందీప్ సినిమా ప్రారంభం

సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నారు.
Similar News
News February 9, 2026
ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 9, 2026
APPLY NOW: NIT రాయ్‌పుర్‌లో ఉద్యోగాలు

<
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.


