News August 20, 2024
ప్రభాస్ స్థాయి చాలా పెద్దది: సుధీర్ బాబు

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేసిన హీరో ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన<<13885603>> వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటీనటులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరో సుధీర్ బాబు స్పందించారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు. కానీ ఇలా తప్పుగా మాట్లాడొద్దు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించింది. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 30, 2025
అన్నదాతకు ‘మొంథా’ దెబ్బ!

‘మొంథా’ తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చి పడింది. ఏపీ నుంచి దిశ మార్చుకుని రాష్ట్రంలోని అన్నదాతల ఆశలను తలకిందులు చేస్తోంది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీటమునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
News October 30, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.


